HomeజాతీయంDelhi Police | పాక్​ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా.. నిందితుల అరెస్ట్

Delhi Police | పాక్​ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా.. నిందితుల అరెస్ట్

పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Police | పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోకి హై ఎండ్ విదేశీ పిస్టళ్లను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించే ఒక ప్రధాన అంతర్జాతీయ ఆయుధ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Delhi Crime Branch Police) ఛేదించారు.

పాక్​ ఐఎస్​ఐ (Pakistan ISI)తో సంబంధం ఉన్న ఈ ముఠా ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలలోని నేరస్థులకు టర్కీ, చైనా తయారీ ఆయుధాలను సరఫరా చేస్తోందని పోలీసులు తెలిపారు.ఈ ముఠాలోని నలుగురు కీలక వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 10 పిస్టళ్లు, 92 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై అధికారులు దర్యాప్తు చేప్టటారు. వీరి ఆయుధాలను ఎవరికి విక్రయించారనే వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా లూథియానా పోలీసులు గురువారం ఒక ఎన్‌కౌంటర్ (Encounter) సమయంలో పాకిస్థాన్ మద్దతుగల అదే ISI మాడ్యూల్‌కు చెందిన ఇద్దరు సభ్యులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారు గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు రెండు చైనీస్ గ్రెనేడ్‌లను, సరిహద్దు మీదుగా అక్రమంగా రవాణా చేయబడిన ఐదు పిస్టళ్లను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Delhi Police | నిఘా వర్గాల సమాచారం మేరకు

డీసీపీ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని పోలీసులు అక్రమ ఆయుధాల రాకెట్​ను ఛేదించడానికి ప్రత్యేక ఆపరేషన్​ (Special Operation) చేపట్టారు. ఢిల్లీలో అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టగా… రోహిణిలో ఈ ఆయుధ నెట్​వర్క్​ గుట్టు బయట పడింది. నిందితులు డ్రోన్‌ల ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్​ సరిహద్దుల నుంచి తెచ్చిన వీటిని దేశంలోని పలు గ్యాంగ్​లకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.