అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia | పాక్ యుద్ధ విమానాల (Pakistan fighter jets) కోసం రష్యా ఇంజిన్లను సరఫరా చేయనున్నట్లు వచ్చిన వార్తలను మాస్కో కొట్టి పారేసింది. ఆ దేశంతో అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని రష్యా ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
పాక్‌కు మద్దతుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. భారత్‌తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు (trade relations) మేం కొనసాగిస్తున్నామని తెలిపాయి. భారత్‌కు ఇబ్బందికరంగా మారే ఎలాంటి చర్యలను తాము చేపట్టబోమని స్పష్టం చేశాయి.
Russia | రష్యా ఇంజిన్లు సరఫరా చేస్తుందంటూ కథనాలు..
పాకిస్థాన్‌లో ఉన్న చైనా (China) తయారీ రకమైన జేఎఫ్–17 ఫైటర్ జెట్స్‌కు (JF-17 fighter jets) ఉపయోగించే ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తోందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సదరు మీడియా నివేదికల ఆధారంగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ ప్రధాని మోదీ (PM Modi) దౌత్య విధానం విఫలమైందని ఆరోపించారు. ఇతర దేశాలతో సంబంధాల విషయంలో మోదీ వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆయన జాతీయ ప్రయోజనాలకంటే తనకు పేరు వచ్చే విషయాలకే ప్రాధాన్యతనిస్తారంటూ విమర్శించారు. కాగా.. రష్యా (Russia) క్లారిటీ ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడింది.
చైనాలో తయారు చేసిన JF-17 ఫైటర్ జెట్ల ఇంజిన్లను సరఫరా చేయడం ద్వారా రష్యా పాకిస్థాన్‌కు సైనిక మద్దతును అందించనుందని మీడియా నివేదికలపై కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ (Jairam Ramesh) మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ దౌత్యం జాతీయ ప్రయోజనాల కంటే ఇమేజ్-బిల్డింగ్, ప్రపంచ దృశ్యాన్ని ఆకర్షించేందుకే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు.