అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Notification | సూపర్‌వైజర్ పోస్టు (Supervisor Post)ల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జోన్‌ల పరిధిలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 198
పోస్టులవారీగా వివరాలు..
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ – 84
మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ – 114
విద్యార్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (Diploma), డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయో పరిమితి : గతేడాది జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు దరఖాస్తు చేసుకోవాలి.
వేతన శ్రేణి : నెలకు రూ. 27,080 నుంచి రూ. 81,400.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : జనవరి 20.
ఎంపిక విధానం : రాత పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం https://www.tgsrtc.telangana.gov.in/careers ను సంప్రదించండి.