Superstar Rajinikanth
Superstar Rajinikanth | రజినీకాంత్ ‘కూలీ’.. చికిటు సాంగ్​ వచ్చేసింది..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Superstar Rajinikanth | తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) కథనాయకుడుగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. లియో సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌ డైరెక్ట్​ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానిన స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Superstar Rajinikanth | చికిటు సాంగ్​ రిలీజ్​

కాగా.. కూలీ మూవీ (Coolie Movie) నుంచి నేడు ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఈ పాటను చిత్ర యూనిట్​ రిలీజ్​ చేసింది. ‘చికిటు’ పాటకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ మూవీ నుంచి రిలీజ్​ అయిన గ్లిమ్స్ సినిమాపై అభిమానుల్లో అంచ‌నాలను విపరీతంగా పెంచింది. తాజాగా.. విడుదల చేసిన ఈ సాంగ్​ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Superstar Rajinikanth | రజినీకి భారీ పారితోషికం..

ఈ మూవీకి రజినీకాంత్‌ పారితోషికం భారీగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్ర డైరెక్టర్ ‍కనగరాజ్‌ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.