అక్షరటుడే, బోధన్ : Renjal Mandal | రెంజల్ మండలం సాటాపూర్ (Satapur) గ్రామంలో ఎంఎన్ఆర్ సూపర్ మార్కెట్ (MNR Super Market)లో దొంగలు చోరీకి యత్నించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్న దొంగలు గ్యాస్ కట్టర్తో తాళాలు కట్ చేశారు.
సూపర్ మార్కెట్ ఓనర్ పాష ఆ సమయంలో లోపలే ఉన్నారు. అలికిడికి ఆయన నిద్ర లేచి కేకలు పెట్టాడు. అంతేగాకుండా పోలీసులకు సమాచారం అందిండాడు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వచ్చే లోపు దొంగలు పారిపోయారు. గ్యాస్ కట్టర్ అక్కడే వదిలిపెట్టి తప్పించుకున్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెంజల్ ఎస్సై (Renjal SI) తెలిపారు.
