అక్షరటుడే, వెబ్‌డెస్క్: super moon | ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జిగేల్ మంటూ వెలుగులు చిమ్ముతూ చూసేవారిని వినువీధిలో చందమామ కనువిందు చేశాడు. సాధారణంగా పౌర్ణమి కంటే చాలా పెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా అబ్బురపర్చాడు. 2026 ఆరంభంలోనే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆకాశం sky లో సూపర్ మూన్‌గా దర్శనమిచ్చాడు.
super moon | వోల్ఫ్ మూన్
జనవరిలో వచ్చే పున్నమిని వోల్ఫ్ పున్నమిగా పేర్కొంటారు. ఉత్తరాది జానపద కథల్లో ఈ పేరు ప్రస్తావన ఉంది. శీతాకాలపు రాత్రులలో తోడేళ్ళు ఎక్కువగా అరుస్తాయట. అందుకే అలా పేర్కొంటారు. వోల్ఫ్ పున్నమి సందర్భంగా కనిపించే ఈ చంద్రుడిని వోల్ఫ్ మూన్ Wolf Moon అని కూడా పేర్కొంటారు. నారింజ- పసుపు రంగులో నింగిలో అతి తక్కువ ఎత్తులో కనిపించాడు. సాధారణ పౌర్ణమి కంటే సుమారు 30 శాతం ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దదిగా దర్శనమిచ్చాడు. స్కెవాచర్లు ఈ దృశ్యాన్ని ఆస్వాదించారు.
హైదరాబాద్‌తో సహా గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, లక్నోలలో సూపర్‌మూన్ దర్శనమిచ్చాడు. ప్రకాశవంతమైన చంద్రుడి ఫొటోలు, వీడియోలను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.