Homeజిల్లాలుకామారెడ్డిRTC Bus | బాన్సువాడ మీదుగా బెంగళూరుకు సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం

RTC Bus | బాన్సువాడ మీదుగా బెంగళూరుకు సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం

బాన్సువాడ నుంచి బెంగళూరుకు బస్సు సర్వీస్ ​ప్రారంభమైంది. ఈ మేరకు డిపో మేనేజర్​ రవికుమార్​ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: RTC Bus | ప్రయాణికుల సౌకర్యార్థం బాన్సువాడ మీదుగా బెంగళూరుకు (Bangalore) బస్సు సర్వీస్​ను ప్రారంభించారు. ఈమేరకు బాన్సువాడ డిపో మేనేజర్​ రవికుమార్​ వివరాలు వెల్లడించారు. బోధన్ డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు (Super luxury bus) సర్వీస్​ను బాన్సువాడ మీదుగా బెంగళూరుకు నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

బోధన్ నుంచి బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం బాన్సువాడకు 1.10 గంటలకు వచ్చి, 1.30 గంటలకు బెంగళూరు వైపు బయలుదేరుతుందని తెలిపారు. ఈ బస్సు మెదక్(Medak), జేబీఎస్, ఎంజీబీఎస్, జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్, బాగేపల్లి మార్గాల మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు బెంగళూరు చేరుతుంది.

అనంతరం బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంగా బస్సు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.05 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలని డిపో మేనేజర్ కోరారు.

Must Read
Related News