అక్షరటుడే, వెబ్‌డెస్క్:Rail One App | భారతీయ రైల్వే(Indian Railway) సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రయాణంలో అవసరమయ్యే అన్ని సేవలను ఒకే వేదికపై అందించేందుకు రైల్ వన్(RailOne) అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్లు, ట్రైన్ టికెట్ల(Tickets)ను బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆహారాన్ని ఆర్డర్ ఇవ్వవచ్చు. కంప్లెయింట్స్ నమోదు చేయవచ్చు. ఇలా అనేక రకాల సేవలను ఒకే వేదికపై అందించే రైల్ వన్ యాప్‌ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) మంగళవారం ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(CRIC) 40వ స్థాపన దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు.
ఇప్పటివరకు రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) యాప్, అన్‌రిజర్వ్‌డ్ టెకెట్ల కోసం యూటీఎస్(UTS) యాప్, ట్రైన్ స్టేస్, ఫుడ్ ఆర్డర్, కంప్లెయింట్స్‌ల కోసం పలు రకాల యాప్‌లను వినియోగించాల్సి వచ్చేది. ప్రస్తుతం రైల్ వన్ యాప్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాల సేవలు ఒకే ప్లాట్‌ఫాం(Single platform)పై లభించనున్నాయి. భవిష్యత్‌లో ఈ యాప్‌లో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌తోపాటు ఆపిల్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంది.
Rail One App | యాప్‌ను వినియోగించే విధానం..
యాప్ స్టోర్(App store)లోకి వెళ్లి రైల్‌వన్ అని సెర్చ్ చేయాలి. సీఆర్‌ఐఎస్ డెవలప్‌చేసిన రైల్‌వన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రైల్ కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్‌లో ఉన్న లాగిన్(Login) క్రిడెన్షియల్స్‌తో ఇక్కడ సైన్ ఇన్ కావొచ్చు. లేదా కొత్త అకౌంట్ కూడా తెరవవచ్చు. ఈ యాప్ సింగిల్ సైన్ ఆన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంటే ఒకే లాగిన్‌తో అన్ని రకాల సేవలను పొందడానికి అవకాశం ఉంటుందన్న మాట.
Rail One App | యాప్ అందే సేవలు..
- రిజర్వ్‌డ్(Reserved), అన్ రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫాం టికెట్లు, సీజనల్ పాస్‌లను బుక్ చేసుకోవచ్చు. రద్దు చేసిన, మిస్డ్ ట్రైన్ టికెట్ల రిఫండ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.
- ట్రైన్, పీఎన్‌ఆర్ స్టేటస్(PNR status), కోచ్ పొజిషన్ తెలుసుకోవచ్చు.
- ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.
- రైలులో ఏదైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయవచ్చు.