6
అక్షరటుడే, మెండోరా: Mendora Mandal | మండలానికి చెందిన సావెల్ గ్రామ యువకుడు దోనుపాల సునీల్ శెట్టి పీహెచ్డీ పట్టా సాధించాడు. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలోని (Osmania University) అరబిక్ విభాగంలో ’అరబిక్ కథలు–సమాజ అభివృద్ధిలో వాటి ప్రభావం’ అనే అంశంపై విశ్లేషణాత్మక పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు.
Mendora Mandal | నిరుపేద కుటుంబం నుంచి..
ప్రొఫెసర్ మోహాజిబిన్ అక్తర్ మార్గదర్శకత్వంలో ఈ పరిశోధన పూర్తిచేసిన సునీల్ శెట్టి, నిరుపేద కుటుంబానికి చెందినవారు. పేద కుటుంబంలో పుట్టి డాక్టరేట్ సాధించడంతో సునీల్ శెట్టిని గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందిస్తున్నారు.