ePaper
More
    Homeలైఫ్​స్టైల్​red meat | సండే.. ముక్క లేనిదే ముద్ద దిగదంటున్నారా.. ఆ అవయవం జాగ్రత్త సుమా..!

    red meat | సండే.. ముక్క లేనిదే ముద్ద దిగదంటున్నారా.. ఆ అవయవం జాగ్రత్త సుమా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: red meat : ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో నాన్​ వెజ్​ గుమగుమలాడాల్సిందే. ముఖ్యంగా మన వివాహం లాంటి శుభకార్యాల్లో నాన్​ వెజ్​ పక్కా ఉండాల్సిందే అంటారు. ముక్క కోసం గొడవలు జరిగిన ఘటనలు అనేకం. ప్రతి సండే ఏ చికెన్​, మటన్​ సెంటర్ల వద్ద చూసినా మాంసప్రియులు బారులుతీరి కనబడటం చూడొచ్చు. మరికొందరైతే వారంలో రెండు, మూడు రోజులు నాన్​వెజ్​ తింటుంటారు.

    red meat : పోషకాలు అవసరమే అయినా..

    మాంసంలో ఉండే పోషకాలు(nutrients) మన శరీరానికి ఎంతో అవసరం. మాంసంలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ, మాంసం అతిగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కూరగాయలు, పండ్లతో పోల్చితే మాంసం ఎంతో చేటు చేస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా మాంసం అధికంగా తినేవారికి పెద్దపేగు క్యాన్సర్(colon cancer) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు.

    మాంసంలో ఎన్నో రకాలు ఉన్నాయి. చిన్న జీవుల నుంచి పెద్ద జంతువుల వరకు ఎన్నో వెరైటీలు. కాగా, పెద్ద జీవుల మాంసం వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్ వల్ల క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రెడ్ మీట్ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కడుపు నొప్పి, మలబద్దకం, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు అధికంగా ఉంటాయి.

    ఫ్రెడ్ఆచ్ క్యాన్సర్ సెంటర్(Fredauch Cancer Center) పరిశోధనలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. అమెరికాలో చాలా మంది కొలొరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2024లో.. దాదాపు 15 లక్షల మందికి పెద్దప్రేగు క్యాన్సర్ ను గుర్తించారు.

    red meat : సుదీర్ఘ కాలం కష్టమే..

    పెద్దప్రేగు క్యాన్సర్ తో పెద్దపేగులో కణితులు(కంతులు) పెరుగుతాయి. దీని నుంచి బయట పడటానికి సాధారణంగా 10 ఏళ్లు పడుతుందట. ఈ సమస్య ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఏర్పడుతుంది. కాగా, ఇటీవల పెద్దపేగు క్యాన్సర్ ను యువతలోనూ వెలుగు చూస్తోందని వైద్యులు చెబుతున్నారు.

    red meat : పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు ఇవే..

    పెద్దపేగు క్యాన్సర్ ను సకాలంలో గుర్తిస్తే.. చికిత్స అందించి సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. పేగు కదలికలో ఏదైనా మార్పు కనిపించినా, మలబద్దకం, విరేచనాలు, మలవిసర్జన తర్వాత అసౌకర్యంగా అనిపించడం, మలంలో రక్తం పడటం, తరచూ కడుపు నొప్పి, బరువు తగ్గడం, అలసట, బలహీనత,రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్ష చేయించుకుంటే బెటర్​.

    red meat : డయాబెటిస్​..

    ఓ పరిశోధన ప్రకారం.. రెడ్​ మీట్​ అధికంగా తినడం వల్ల డయాబెటిస్(Diabetes) ప్రమాదం కూడా పెరుగుతుందట. మాసం అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం 46 శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

    red meat : గుండె పైలం..

    రెడ్ మీట్ తో గుండె జబ్బులు(heart disease) వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు. నిరంతరం మాంసం తింటే కొలెస్ట్రాల్(cholesterol), ఊబకాయం(obesity) సమస్యలు పెరుగుతాయి. జీర్ణక్రియ సమస్యలను సృష్టిస్తుంది. అజీర్ణం(indigestion) క్యాన్సర్​కు దారితీస్తుందని వైద్యుల మాట. సో, మాంసం ప్రియులూ తస్మాత్​ జాగ్రత్త.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 13 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ...

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 13 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ...

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...