ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Surya Namaskar | ఆయుష్షును పెంచే సూర్యనమస్కారాలు

    Surya Namaskar | ఆయుష్షును పెంచే సూర్యనమస్కారాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Surya Namaskar | క్రమం తప్పకుండా యోగాసనాలు(Yoga asanas) వేయడం వల్ల చాలావరకు ఆరోగ్య సమస్యలు(Health issues) దూరమవుతాయని యోగా గురువులు పేర్కొంటున్నారు. శరీరం ఫ్లెక్సిబిల్‌గా మారుతుందని చెబుతున్నారు. ప్రధానంగా సూర్యనమస్కారాలకు యోగాలో ప్రాధాన్యత ఉంటుంది. నిత్యం సూర్య నమస్కారాలు వేయడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న సూర్యనమస్కారాలు(Surya Namaskaras) ఎలా చేయాలో తెలుసుకుందామా..

    సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో సూర్యాభిముఖంగా నిలబడి సూర్యనమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాలు 10 భంగిమలలో ఉంటాయి.

    Surya Namaskar | మొదటి స్థితి..

    ముందుగా నిటారుగా నిలబడి, కాళ్లు, పాదాలను దగ్గరగా చేర్చాలి. అర చేతులను నమస్కార స్థితిలో ఛాతీ(Chest)పై ఉంచాలి. శరీర భారం రెండు కాళ్లపై సమానంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ(Inhale) రెండు మోచేతులలో వంపు లేకుండా ఏటవాలుగా తల పైకెత్తి చేతులను పైకి లాగాలి. రెండు అరచేతులు ఒత్తిడి చేస్తూ ఒకదానికొకటి కలపాలి. చేతులు చెవులకు ఆనకుండా చూసుకోవాలి. నడుము పైభాగం, తలను వెనుకకు వంచాలి. మోకాళ్లను వంచరాదు. దృష్టిని కరమూలంపై ఉంచాలి. కర మూలాలను నొక్కతూ వెనక్కి లాగాలి.

    READ ALSO  Tea Benefits | ఛాయ్‌.. భలే లాభాలోయ్‌.. టీ తాగితే గుండెజ‌బ్బులు దూరం

    Surya Namaskar | రెండో స్థితి..

    శ్వాస వదులుతూ(Exhale) చేతులతో సహా నడుమును ముందు నుంచి కిందికి వంచి, రెండు అర చేతులను పాదాల వద్దకు తెచ్చి, పక్కన నేలపై ఆనించాలి. నుదిటితో మోకాళ్లను తాకాలి. ఈ స్థితిలో కాలి, చేతివేళ్లు ఒకే రేఖలో ఉండాలి. మోకాళ్ళను వంచరాదు.

    Surya Namaskar | మూడో స్థితి..

    శ్వాస తీసుకొంటూ ఎడమకాలును తిన్నగా వెనక్కి తీసుకెళ్లాలి. ఎడమపాదం పంజా వంచకూడదు. మోకాలు భూమిపై ఆనాలి. కుడి మడిమను నేలపై నొక్కి, కుడి మోకాలును వీలైనంత వరకు ముందుకు తేవాలి. ఈ స్థితిలో కుడి తొడ, కుడి భుజం కలిపి ఉంచాలి. దృష్టి ముందుకు ఉండాలి.

    Surya Namaskar | నాలుగో స్థితి..

    శ్వాస వదులుతూ ఎడమ మోకాలు వంపు తీసి, కుడి కాలు వెనక్కి తీసుకెళ్లి ఎడమకాలితో కలపాలి. పాదాల నుంచి తల వరకు శరీరమంతా భూమికి 300 డిగ్రీల ఏటవాలుగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో శరీర భారం అరచేతులు, కాలివేళ్లపైన ఉండాలి.

    Surya Namaskar | ఐదో స్థితి..

    శ్వాస వదిలిన స్థితిలోనే ఉంటూ రెండు మోచేతుల దగ్గర వంచి శరీరం మొత్తాన్ని భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో నుదురు, ఛాతి, అరచేతులు, మోకాళ్లు, కాలి వేళ్లు మాత్రమే నేలకు అనించాలి. రెండు భుజాలు వీపు వైపు లేపి ఒకదానికొకటి దగ్గరికి తేవాలి. ఇలా చేయడం వల్ల ఛాతి భూమికి సులభంగా ఆనుతుంది.

    READ ALSO  Junk Food Day | జంక్ ఫుడ్ తినే అలవాటు ఉందా, అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! నేడు నేషనల్ జంక్ ఫుడ్ డే..

    Surya Namaskar | ఆరో స్థితి..

    శ్వాస తీసుకొంటూ మోచేతుల వద్ద వంపు తీసి, చేతులు భూమికి లంబంగా ఉంచి, శరీరాన్ని ముందుకు తెస్తూ, ఛాతీని, తలను పైకి లేపాలి. నడుమును, నాభిని చేతుల మధ్యకు తీసుకురావాలి. తల, రెండు భుజాలు వెనక వైపు లాగి ఉంటాయి. మోకాళ్లు నేలను తాకరాదు.

    Surya Namaskar | ఏడో స్థితి..

    శ్వాస వదులుతూ శరీరాన్ని వెనక్కి, తలను కిందికి తెస్తూ, పిరుదులను వీలైనంత పైకి లేపాలి. తల(Head)ను రెండు చేతుల మధ్యగా లోపలికి ఉంచాలి.

    Surya Namaskar | ఎనిమిదో స్థితి..

    శ్వాస తీసుకొంటూ మూడో స్థితి వల ఎడమకాలు తిన్నగా ముందుకు, రెండు చేతుల మధ్యలోకి తీసుకు రావాలి. ఎడమ తొడ, ఎడమ భుజం కలిపి ఉంచాలి. దృష్టి ముందుకు ఉండాలి.

    READ ALSO  Nutritional Biryani | పోషకాల గని.. ప్రకృతి బిర్యానీ

    Surya Namaskar | తొమ్మిదో స్థితి..

    శ్వాస వదులుతూ కుడిపాదాన్ని(Right foot) ఎడమ పాదం పక్కకు తేవాలి. రెండో స్థితిలో వలె నుదురును మోకాళ్లకు ఆనించాలి.

    Surya Namaskar | పదో స్థితి..

    శ్వాస వదిలిన స్థితిలోనే ఉంటూ నడుమును పైకి లేపి, నిటారుగా నిలబడి నమస్కార స్థితికి చేరాలి. ఈ పది స్థితులను రోజూ కనీసం 13 సార్లు చేయాలి.

    Surya Namaskar | ప్రయోజనాలు..

    సూర్య నమస్కారాలతో ఎన్నో ప్రయోజనాలు (Benifits) ఉన్నాయి. క్రమం తప్పకుండా రోజూ సూర్యనమస్కారాలు చేస్తే బాలలు, యువత బాగా ఎత్తు పెరుగుతారు. శారీర సౌష్టవం సమకూరుతుంది. జీర్ణవ్యవస్థ(Digestive system) సక్రమంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. సైనస్‌, జలుబు, దగ్గు వంటి జబ్బులనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆయుష్సు, జ్ఞాపకశక్తి(Memory power), తెలివితేటలు పెరుగుతాయి. హైబీపీ అదుపులోకి వస్తుంది.

    Surya Namaskar | ఎవరు చేయొద్దు..

    నడుము నొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులు, హెర్నియా సమస్యలు ఉన్నవారు సూర్యనమస్కారాలకు దూరంగా ఉండాలి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...