5
అక్షరటుడే,బోధన్: Summar Camp | సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS Saloora) శనివారంతో వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ఎంపీడీవో శ్రీనివాస్ హాజరయ్యారు. శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లిష్ (Spoken English), యోగాలో తర్ఫీదునిచ్చిన ఉపాధ్యాయులను ఎంఈవో రాజమంజూష అభినందించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వామి, సీఆర్పీ స్వర్ణ, ఆఫీస్ సబార్డినేట్ వనజ, టీచర్లు సౌమ్య, సృజన, అవినాష్ బాబు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.