అక్షరటుడే, కామారెడ్డి: SPR School | కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివారు ఎస్పీఆర్ పాఠశాలలో నెల రోజులుగా జరుగుతున్న వేసవి క్రీడోత్సవాలు (Summer sports) శనివారం ముగిశాయి. 60 మంది విద్యార్థులకు వాలీబాల్ (Volleyball), ఫుట్బాల్ (Footbal), ఖోఖో(KhoKho)లో తర్ఫీదునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతుల అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. చదువు మానసిక ఉల్లాసాన్ని ఇస్తే, క్రీడలు శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాస్కర్, నరేందర్, హర్షవర్ధన్ రెడ్డి ,హరీష్, ప్రవీణ్ కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.