అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance Masters Association) ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కళాభారతి ఆడిటోరియం(Kala Bharathi Auditorium)లో నిర్వహించిన సమ్మర్ డాన్స్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో డాన్స్ మాస్టర్లు విద్యార్థులకు ప్రత్యేకంగా డాన్స్ ప్రాక్టీస్ చేయించారు.
డాన్స్ నేర్చుకోవడానికి విద్యార్థులు ఉత్సాహం కనబరిచారు. దాదాపు 15 రోజుల పాటు ప్రాక్టీస్ అనంతరం ఇవాళ ఆడిటోరియంలో నిర్వహించిన డాన్స్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులు(students) తమలో దాగున్న ప్రతిభను ప్రపంచానికి చూపించారు.

సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేశారు. తోటి విద్యార్థులు ఈలలు, కేరింతలతో ఉత్సాహపరిచారు. డాన్స్ ఫెస్ట్ అనంతరం విద్యార్థులకు నిర్వాహకులు మెమోంటోలను అందజేశారు.