అక్షరటుడే,కామారెడ్డి గ్రామీణం: వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువజన, క్రీడల శాఖాధికారి జగన్నాథం సూచించారు. రామారెడ్డిలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10 ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామారెడ్డి ఇప్పటివరకు 34 మంది బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. 14 ఏళ్లలోపు బాల బాలికలు క్యాంప్‌లో చేరవచ్చని పేర్కొన్నారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్ కుమార్, తహశీల్దార్ ఉమాలత, ఎంపీడీవో తిరుపతిరెడ్డి కోచింగ్ ఇన్‌ఛార్జి బాలరాజు, తదితరులున్నారు.
