ePaper
More
    HomeతెలంగాణSummer Camp | విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే సమ్మర్​ క్యాంప్​

    Summer Camp | విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే సమ్మర్​ క్యాంప్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Summer Camp | విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఆర్​బీవీఆర్​ఆర్​ పాఠశాల(RBVRR School)లో వారం రోజుల సమ్మర్ క్యాంప్​(Summer Camp)ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాలికలు సమాజంలో ఎలా ఉండాలనే విషయాలను క్యాంప్​లో వివరిస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్(Self Motivation) తరగతులు ఉంటాయన్నారు. ఉదయం తైక్వాండో(Taekwondo), సెల్ఫ్ డిఫెన్స్(self defense) శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల బాలికలను శిక్షణ శిబిరంలో చేర్పించాలని, శనివారం వరకు అవకాశముందని చెప్పారు.

    అనంతరం మానసిక వైద్య నిపుణులు విశాల్(Psychiatrist Vishal) మాట్లాడుతూ.. సమాజంలో ప్రస్తుతం సెల్​ఫోన్​ మోజు(Cellphone addiction)లో పడి యువత చెడుదారుల్లో వెళ్తోందన్నారు. కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్ శ్రీహరి, ట్రైయినీ ఐపీఎస్ సాయికిరణ్, సౌత్ రూరల్ ఇన్​స్పెక్టర్​ సురేష్ కుమార్, యోగా మాస్టర్ కిషన్, తైక్వాండో ట్రైనర్ మనోజ్, రూరల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...