- Advertisement -
HomeUncategorizedHero Sumanth | మృణాల్ ఠాకూర్‌తో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో

Hero Sumanth | మృణాల్ ఠాకూర్‌తో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hero Sumanth | అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ (akkineni family hero sumanth) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారు సుమంత్.

కాగా, ఆయ‌న రామ్ గోపాల్ వర్మ (ram gopal varma) దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సుమంత్ ఒకప్పుడు వరుస చిత్రాలతో, విజయాలతో దూసుకుపోయాడు. సుమంత్ కెరీర్‌లో సత్యం ఎవర్ గ్రీన్‌గా మూవీ (sumanth career ever green movie sathyam) అని చెప్పాలి. గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్ళీ రావా వంటి క్లాసిక్స్ కూడా సుమంత్ కెరీర్‌లో ఉన్నాయి. సుమంత్ ఈ మ‌ధ్య సినిమాలు బాగా త‌గ్గించాడు. అడ‌పాద‌డపా సంద‌డి చేస్తున్నాడు.

- Advertisement -

Hero Sumanth | పెళ్లి చేసుకోడా..

సుమంత్ న‌టించిన ‘అనగనగా’ మూవీ (anaganaga movie) మే 8న ఓటీటీలో నేరుగా రిలీజ్ కావాల్సి ఉండగా… మే 15కి వాయిదా పడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సుమంత్‌కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌డం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా, ఎన్ని జానర్లు మార్చేస్తున్నా కూడా సక్సెస్ రావ‌డం లేదు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి (personal life) సంబంధించిన ఓ వార్త కొద్ది రోజులుగా నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తొలి ప్రేమ హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్ కొన్నాళ్ల‌కి ఆమె నుండి విడిపోయాడు. ఇక అప్ప‌టి నుండి సింగిల్‌గానే ఉంటున్నాడు. అయితే ఆ మధ్య రెండో పెళ్లి (second marriage) అంటూ రకరకాల వార్తలతో సుమంత్ ట్రెండ్‌లోకి వచ్చాడు.

మృణాల్ ఠాకూర్‌తో సుమంత్ రెండో పెళ్లి (sumanth marrying mrunal thakur second marriage) ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మయంలో తన పెళ్లి వార్తల్లో నిజం లేదని.. అసలు తనతో ఎలాంటి రిలేషన్‌గానీ, కమ్యూనికేషన్ గానీ లేదని కుండబద్దలు కొట్టేశాడు సుమంత్‌.

‘మృణాల్ ఠాకూర్‌తో (mrunal thakur) కలిసి నేను ‘సీతారామం’ చిత్రంలో (seetharamam movie) నటించాను. అప్పుడే ఇద్దరం కలిసి అలా ఫోటో దిగాం. షూటింగ్ పూర్తయ్యాక ఆమెతో కనీసం టచ్‌లో కూడా లేను. అలాంటిది పెళ్లి అంటూ వార్త‌లు ఎందుకు అలా రాస్తున్నారో అర్ధం కావ‌డం లేదు. నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. సింగిల్‌గా ఉండటమే ఇష్టం. రోజులో ఐదు గంటలు ఓటీటీ సిరీస్‌లు, సినిమాలు చూస్తా.. జిమ్ చేస్తా, స్పోర్ట్స్ ఆడతా.. రొటీన్ లైఫ్ (routine life) నాకు అస్సలు బోర్ కొట్టదు. అందుకే నేను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా రానివ్వడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు . ఆయ‌న మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేన‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News