అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Suma Kanakala | బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా ఓ వెలుగు వెలుగుతుంది సుమ కనకాల Suma kanakala. తనదైన యాంకరింగ్‌తో ఎన్నో టీవీషోలను విజయవంతంగా నడిపిస్తున్న సుమకి పోటీ అనేదే లేదు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేరళకి చెందిన సుమ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతుంది. సుమ నాటకాలు వేసింది, సీరియల్స్ చేసింది. సినిమాలలో నటించింది. సుమ కెరీర్ బిగినింగ్‌లో వేయిపడగలు అనే సీరియల్‌తో పరిచయమయ్యారు సుమ. ఈ సీరియల్లో లీడ్ రోల్లో కనిపించారు సుమ. ఆ తర్వాత మేఘమాల సీరియల్లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్(Rajiv)తో ప్రేమలో పడ్డారు. 2006లో ‘అవాక్కయ్యారా…’ అనే ప్రోగ్రాంతో యాంకరింగ్ కెరీర్ మొదలు పెట్టింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు(Kalyana Prathirastu) సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటించారు సుమ. ఆ తర్వాత మలయాళంలో కూడా రెండు సినిమాల్లో హీరోయిన్గా చేశారు.
Suma Kanakala | మౌనవ్రతం ఎందుకు
సుమ థియేటర్ ఆర్టిస్ట్ కూడా. చాలా నాటకాలు వేశాను అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘కొడుకు పుట్టాలి అనే తెలుగు నాటకం హిందీలో చేయగా, ఆ నాటకం కోసం ఖరగ్ పూర్, ఢిల్లీ.. అలా చాలా ప్లేసెస్ లో తిరిగి నాటకాలు వేశాను. అప్పట్లోనే రైల్వేస్‌లో నాటకాలలో బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు National award గెలుచుకున్నాను. సంఘం మారాలి, రేపటి మహిళ, స్వామి వివేకానంద.. ఇలా చాలా నాటకాలు వేశాను’ అని తెలిపింది. సుమ వాళ్ల నాన్న రైల్వే ఎంప్లాయి కావడంతో ఉద్యోగం కోసం కేరళ నుంచి సికింద్రాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ రైల్వే క్వార్టర్స్‌లో పెరిగిన సుమ రైల్వేలో జరిగే అనేక ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది సుమ. ఆ క్రమంలోనే సుమ థియేటర్ ఆర్టిస్ట్ గా రైల్వేస్‌లో నాటకాలు కూడా వేసింది.
తన వాయిస్ సమస్య గురించి కూడా వివరించింది. ‘నాకు వోకల్ నాడ్యూల్స్(Vocal Nodules) వచ్చినపుడు డాక్టర్స్ నా వాయిస్ కి రెస్ట్ ఇవ్వమని చెప్పారు. దాంతో పది రోజులు నేను మౌన వ్రతం చేశాను. నా వోకల్ కార్డ్స్ vocal cardsలో స్మాల్ బంప్స్ లాంటివి వచ్చాయి, దాంతో డాక్టర్ అస్సలు మాట్లాడొద్దు అన్నారు. పది రోజులు మాట్లాడకుండా ఉన్నాను’ అని తెలిపింది. వోకల్ నాడ్యూల్స్ అంటే గొంతులో మాట్లాడడానికి ఉండే నరాలకి వచ్చే సమస్య. ఎక్కువగా మాట్లాడటం, అరవడం లాంటివి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇక సుమ కుమారుడు రోషన్(Roshan) హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య బబుల్‌గమ్ సినిమా చేశారు. ఇక ఇప్పుడు మోగ్లీ అనే సినిమాతో రాబోతున్నాడు.