ePaper
More
    Homeఅంతర్జాతీయంSukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్​ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. బృహత్తరమైన ఈ ఆపరేషన్​లో సుఖోయ్ జెట్‌లు Sukhoi jets కీలక పాత్ర పోషించాయి. తాజాగా వీటిని అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

    Sukhoi jets : సుదీర్ఘ చర్చ..

    రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్‌తో జరిగిన చర్చల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్​ విషయాన్ని ప్రతిపాదించారు. ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల ప్రొడక్షన్​, సుఖోయ్-30MKI యుద్ధ విమానాల Sukhoi-30MKI fighter jets అప్‌గ్రేడ్, S-400 క్షిపణి వ్యవస్థ(S-400 missile system)పై సుదీర్ఘంగా చర్చించారు.

    Sukhoi jets : కింగ్​డావోలో..

    షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా చైనాలోని కింగ్‌డావో(Qingdao)లో నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. భారత వైమానిక దళం వద్ద సుమారు 260 సుఖోయ్ 30-MKI జెట్‌లు ఉన్నాయి.

    READ ALSO  Donald Trump | ట్రంప్ పిచ్చి నిర్ణ‌యాలు.. ఆందోళ‌న‌లో నిపుణులు.. ఇండియ‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్ద‌ని తాజా వ్యాఖ్య‌లు

    Sukhoi jets : ప్రధానంగా వీటిపైనే చర్చ..

    ఆండ్రీ బెలోసోవ్, రాజ్​నాథ్​ సింగ్ కలిసి ఉగ్రవాదం, ఇండో-రష్యన్ రక్షణ సహకారం తదితర అనేక అంశాలపై ఇరువురు చర్చించినట్లు శుక్రవారం భారత్​ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పహల్గామ్​ ఉగ్రవాద దాడిపై రష్యా సంఘీభావం తెలిపినట్లు వెల్లడించింది.

    “S-400 సరఫరా, సుఖోయ్​ MKI అప్‌గ్రేడ్‌, సైనిక హార్డ్‌వేర్‌ కొనుగోలు.. తదితరాలు ఈ సమావేశంలో చర్చించిన కొన్ని ముఖ్యమైన అంశాలుగా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. కాగా, 5.5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా.. రష్యా(Russia) మూడు యూనిట్ల లాంగ్- రేంజ్ క్షిపణుల(long-range missiles)ను సరఫరా చేయడం గమనార్హం.

    Latest articles

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    Samagra Siksha | సమగ్ర శిక్ష ఉద్యోగులను బదిలీ చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర...

    More like this

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...