అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా(Medak district)లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన ఎరుకల అశోక్ అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వచ్చింది. అయితే కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) ఆయన పేరును జాబితా నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
