ePaper
More
    Homeఅంతర్జాతీయంSuicide attack in Peshawar | పెషావర్‌లో వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి..

    Suicide attack in Peshawar | పెషావర్‌లో వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Suicide attack in Peshawar : పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. రింగ్ రోడ్డులో పోలీసులే లక్ష్యంగా ఆదివారం(మే 11) సాయంత్రం ఈ దాడి చేసినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

    ఘటన గురించి సమాచారం అందగానే భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. ‘ఈ దాడిలో సబ్-ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు’ అని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ (CCPO) ఖాసిం ఖాన్ వెల్లడించారు.

    పోలీసు మొబైల్ police mobile లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగిందని CCPO ఖాసిం ఖాన్ తెలిపారు. రింగ్ రోడ్ మాల్ మండి ప్రాంతానికి సమీపంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి కాలంలో.. ఈ సిటీలో పోలీసులను లక్ష్యంగా చేసుకున్న ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి.

    ఇదిలా ఉండగా.. గ్వాదర్‌లోని ఓ మసీదు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున హ్యాండ్ గ్రెనేడ్ విసిరిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పేలుడులో ఒక పోలీసు మృతి చెందాడు. దాడి చేసిన దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయారు.

    కాగా, మసీదు సమీపంలో దాడి చేసిన వారికి, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సయ్యద్ హష్మీ అవెన్యూ Syed Hashmi Avenue లోని బిలాల్ మసీదు Bilal Mosque సమీపంలో ఉన్న నివాస ప్రాంతాలను దుండగులు గ్రెనేడ్లతో దాడి చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్లు గ్వాదర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ Gwadar Senior Superintendent of Police (SSP) జియా మండోఖైల్ తెలిపారు. దుండగులు మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక దుండగుడు మరణించాడు. మిగతావారు పారిపోయారు. అయితే ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా మరణించాడు.

    Latest articles

    Gold price on august 21 | త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఇంకా ల‌క్ష మార్క్ పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold price on august 21 | బంగారం కొనాల‌నుకున్న వారు ఏ మాత్రం ఆల‌స్యం...

    Pre Market Analysis on August 21 | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis on August 21 | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో...

    Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

    అక్షరటుడే, హైదరాబాద్ : Rusks | ఉదయం టీతో పాటు రస్క్‌లు తినడం మనలో చాలామందికి ఒక అలవాటు....

    August 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 21 Panchangam : తేదీ (DATE) – 21 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    More like this