- Advertisement -
HomeతెలంగాణSelfie Video | మెదక్ జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం.. సెల్ఫీ వీడియో వైరల్

Selfie Video | మెదక్ జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం.. సెల్ఫీ వీడియో వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Selfie Video | మెదక్ జిల్లా(Medak District) శభాష్ పల్లి గ్రామంలో ఒక యువకుడు చేసిన ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి అనే యువకుడు, కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగుతూ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుధాకర్ ఈ వీడియోను తన స్నేహితుడికి పంపించగా, దానిని చూసిన స్నేహితులు వెంటనే స్పందించి అతన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి(Medak Government Hospital)కి తరలించారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Selfie Video | బత‌కాల‌ని లేదు..

మూడు సంవత్సరాల క్రితం ఓ ఏడేళ్ల బాలికపై సుధాక‌ర్ రెడ్డి అత్యాచారయత్నం చేశాడన్న ఆరోపణలపై పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో, తనపై శిక్షపడే అవకాశముందని భావించిన సుధాకర్, తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. సుధాకర్ తన సెల్ఫీ వీడియో(Selfie Video)లో కన్నీటిపర్యంతమవుతూ, తాను ఏ తప్పూ చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అస‌త్యాలు అని చెప్పాడు. ఈ వీడియో చూసిన అతని స్నేహితులు షాక్‌కు గురై వెంట‌నే రెస్పాండ్ అయ్యారు. దాంతో సుధాక‌ర్ రెడ్డి పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించి, ఆత్మహత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజ నిజాలు ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు. ఏది ఏమైనా సుధాక‌ర్ రెడ్డి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News