అక్షరటుడే, వెబ్డెస్క్ : Sudeep Pharma | గుజరాత్లోని వడోదరకు చెందిన సుదీప్ ఫార్మా (Sudeep pharma).. ఫార్మా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీస్ కోసం స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తుంది. మార్కెట్నుంచి రూ.895 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవో(IPO)కు వచ్చింది.
Sudeep Pharma IPO | 93.71 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్
ఈ పబ్లిక్ ఇష్యూలో రూ. 95 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేశారు. ప్రమోటర్లు సుమారు రూ.800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్(OFS)లో విక్రయించారు. నవంబర్ 21న ప్రారంభమైన ఐపీవో బిడ్డింగ్ ప్రక్రియ 23తో ముగిసింది. చిన్న ఇష్యూ కావడం, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) బాగుండడంతో దీనికి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 93.71 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ (Over subscribe) అయ్యింది.
రిటైల్ పోర్షన్ 15.65 రెట్టు సబ్స్క్రైబ్ కావడం గమనార్హం. కంపెనీ షేర్లు శుక్రవారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును (Equity share) గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 593కు ఆఫర్ చేయగా.. రూ. 137 ప్రీమియంతో రూ. 730 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 23 శాతం లాభాలు (Profit) వచ్చాయన్న మాట. లిస్టింగ్ తర్వాత కూడా కంపెనీ షేర్లు బలాన్ని చూపిస్తున్నాయి. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో సుమారు 28 శాతం ప్రీమియంతో రూ. 759 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.