అక్షరటుడే, ఇందూరు : Chief Advisor Sudarshan Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం నీలకంఠేశ్వరాలయాన్ని (Kantheshwara Temple) దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Chief Advisor Sudarshan Reddy | దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో..
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో సుదర్శన్ రెడ్డితో (Sudarshan Reddy) ప్రత్యేకంగా అభిషేకం, అర్చన చేయించారు. శాఖ జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు స్వామివారి శేషవస్త్రంతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాణాధికారి శ్రీరాం రవీందర్, ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి, డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్, ఇతర సభ్యులు, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
