5
అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Constable Pramod | ఇటీవల విధి నిర్వహణలో మరణించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Constable Pramod | ఉద్యోగం విషయమై..
బాధిత కుటుంబానికి రావాల్సిన ఉద్యోగ విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) , సీపీ సాయిచైతన్యతో (CP Sai Chaitanya) మాట్లాడతానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట నుడా ఛైర్మన్ కేశవేణు, సీనియర్ నాయకులు నాగేష్ రెడ్డి, నరాల రత్నాకర్ తదితరులున్నారు.