అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి స్పందించారు. ప్రైవేట్ బస్సుల తనిఖీలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ (Vemuri Kaveri Travels) కు చెందిన వోల్వో బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరు సమీపంలో కాలిపోయిన విషయం తెలిసిందే. బస్సు బైక్ను ఢీకొనడంతో మంటలు వ్యాపించి 20 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Prabhakar) మాట్లాడుతూ.. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే ట్రావెల్స్ యజమానులు వేధింపులు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
Ponnam Prabhakar | సమగ్ర విచారణ
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సుల స్పీడ్ నియంత్రణ కోసం చర్యలు చేపడుతామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) మధ్య అనారోగ్యకర పోటీ ఉందన్నారు. దానిని నివరిస్తామని ఆయన చెప్పారు. మృతుల వివరాలు తెలిశాక రాష్ట్ర ప్రభుత్వం (State Government) తరఫున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
Ponnam Prabhakar | నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నం హెచ్చరించారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన ఊరుకోమన్నారు. యజమానుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే హత్య నేరం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
