అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (MAUD)పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని ఆయన సూచించారు.
దేశంలోని ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో ప్రస్తుతం కాలుష్యం (Pollution) పెరిగిపోయిందన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరానికి రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు.
CM Revanth Reddy | శాశ్వత పరిష్కారం చూపాలి
నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.