ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని Tollywood సినీ హీరో విజయ్ దేవరకొండ (Film hero Vijay Deverakonda) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Anti-Drug Day) సందర్భంగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(Telangana Narcotics Bureau) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), హీరో రామ్‌చరణ్‌ (hero Ram Charan) తదితరులతో కలిసి పాల్గొన్న విజయ్ దేవరకొండ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు.

    తల్లిదండ్రులు తలదించుకునే పనులు చేయొద్దని, డ్రగ్స్ తీసుకునేవారిని సమాజం చిన్నచూపు చూస్తుందని గుర్తుచేశారు. తన అభిమానులు, తెలంగాణ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేసే స్నేహితులను దూరం పెట్టాలని, తద్వారా మన రాష్ట్రం, దేశం ప్రపంచంలో నంబర్ వన్​గా నిలవడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

    Vijay Deverakonda : నాది చిన్న ప్రపంచం..

    తనది చాలా చిన్న ప్రపంచమని, అందులోనే బతుకుతానని చెప్పారు. నాకు నా ఫ్రెండ్స్ ముఖ్యం. మా అమ్మనాన్న సంతోషం ముఖ్యం. డబ్బులు ముఖ్యం. సంతోషంగా, సౌకర్యంగా బతకాలి. అందుకోసం నచ్చిన పని చేసుకుని ఇంటికి వెళ్లిపోతుంటానని చెప్పారు. అందుకే బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదని, తనకు పాలిటిక్స్ కూడా పెద్దగా తెలియదన్నారు.

    డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక రోజు పెట్టే అవసరం కూడా వచ్చిందా? అని ఈ సందర్భంగా ఆశ్చర్యం వక్తం చేశారు. ‘నేను వైజాగ్​ VIZAG లో ఒకసారి షూటింగ్లో ఉండగా అక్కడున్న పోలీస్ అధికారి వచ్చి డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంపై మాట్లాడాలి అని కోరారు. అప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామని అని వారిని అడిగా. వారు వాస్తవం చెప్పడంతో వెంటనే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మేం చెప్పేది కూడా విని మారుతారనుకుంటా’ అని విజయ్ దేవరకొండ అన్నారు.

    Vijay Deverakonda : నేను రెండు జీవితాలు చూశా..

    జీవితానికి డబ్బులు ముఖ్యమని, కానీ అవే జీవితం కాకూడదని విజయ్‌ అన్నారు. సక్సెస్‌, మనీ, రెస్పెక్ట్‌ ఉంటేనే జీవితానికి కిక్‌ వస్తుందన్నారు. ‘మనకి ఆరోగ్యం చాలా ముఖ్యం. మనమంతా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండాలి. లేదంటే ఏమీ చేయలేం. అమ్మానాన్న గర్వంగా ఉండాలి. నేను డబ్బులు లేని జీవితం, డబ్బులు ఉన్న జీవితం చూశా. వయసులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు ప్రభావం చూపుతారు. ఈ వయసులో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యం’ అని విజయ్ పేర్కొన్నారు.

    విజయం, డబ్బు, గౌరవం లేని పని చేయటం అనవసరమన్నారు. ‘మంచిగా వర్కవుట్ చేస్తే నాకు హైప్ అనిపిస్తుంది. బాడీ ఫిట్​గా ఉండి దుస్తులు మంచిగా వేస్తే ఆ మజానే వేరు. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక గుర్తింపు వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఒక గుర్తింపు వస్తుంది. డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకో గుర్తింపు వస్తుంది. నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీగా ఉంటుంది’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలని.. వ్యాయామం చేయాలని విజయ్ దేవరకొండ సూచించారు. మన తల్లిదండ్రులు గౌరవంగా ఉండేలా చూడాలని చెప్పారు.

    Vijay Deverakonda : యుద్ధమే అవసరం లేదు..

    ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదు. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని విజయ్‌ అన్నారు. కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిష్యత్తును నాశనం చేయాలని భావిస్తున్నాయని చెప్పారు. ‘మనం సాలిడ్​గా ఉండాలి. మన దేశం కూడా సాలిడ్​గా ఉండాలి. మనం నంబర్ వన్ గా ఉండాలి. దేశం నంబర్ వన్ గా ఉండాలంటే మనం డ్రగ్స్ ను దూరం ఉంచాలి. డ్రగ్స్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం..తర్వాత ఆపేద్దామనుకుని అటువైపు వెళ్తే మళ్లీ తిరిగి రావడం చాలా కష్టం’ అని విజయ్ తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...