అక్షరటుడే, ఆర్మూర్: Armoor MLA | గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఈ మేరకు ఆలూర్ మండలం (Alur mandal) మిర్దాపల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణంతో గ్రామాల్లో విద్యుత్ సమస్య (power problem) కనుమరుగవుతుందన్నారు.
Armoor MLA | కాంగ్రెస్ ప్రభుత్వపరంగా కృషి..
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy) మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తున్నామన్నారు. విద్యుత్ రంగంలో తీసుకుంటున్న చర్యల వల్ల గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. మిర్దాపల్లి సర్పంచ్ యెల్ల సాయిరెడ్డి మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలియజేశారు. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపల్లి నగేష్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ రాజేశ్వర్ రావు, డీఈ రఘు, డీఈ కన్స్ట్రక్షన్స్ వెంకటరమణ, రాజశేఖర్, ఏడీఏ కృష్ణ, ఏఈ శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఆలూర్ మండలం సర్పంచ్లు ముక్కెర విజయ్, దశరథ్, చిన్నయ్య, కాంగ్రెస్ నాయకులు వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.