అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gadugu Gangadhar | రాష్ట్ర ప్రభుత్వం (State Government) వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. రెండేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో సంక్రాంతి నుంచి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను రైతులకు అందిస్తామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో కలిశామన్నారు. రైతు కమిషన్ సీఎంతో అనేక విషయాలపై చర్చిందని తెలిపారు. కమిషన్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారనన్నారు. అవసరం అయితే అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.
Gadugu Gangadhar | రైతులకు అవగాహన
రైతు కమిషన్ (Rythu Commission) ఆధ్వర్యలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టి పంట మార్పిడిపై అవగాహన కల్పించామని గడుగు గంగాధర్ తెలిపారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు, తృణధాన్యాలు, పప్పుదినుసుల సాగు పెంచేలా చర్యలు చేపడుతామన్నారు. చెరుకు, పసుపు, బత్తాయి సాగు విస్తీర్ణం పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.