HomeUncategorizedSubhanshu Shukla | పుడమికి బయల్దేరిన శుభాన్షు శుక్లా.. అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం

Subhanshu Shukla | పుడమికి బయల్దేరిన శుభాన్షు శుక్లా.. అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Subhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మంగళవారం భూమికి తిరిగి రానున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International Space Station) 18 రోజుల పాటు పని చేసిన అతను సోమవారం తిరుగు ప్రయాణమయ్యాడు.

మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుక్లా (Subhanshu Shukla) గత నెలాఖరులో అంతరిక్షానికి బయల్దేరిన సంగతి తెలిసింది. 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ పరిశోధనలు చేసిన అతడు మంగళవారం మధ్యాహ్నం తిరిగి భూమికి చేరుకోనున్నాడు. వ్యోమగాములతో బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ నౌక కాలిఫోర్నియా తీరంలో దిగనుంది.

Subhanshu Shukla | విజయవంతంగా అన్ డౌకింగ్ ప్రక్రియ

అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ (SpaceX Dragon) విజయవంతం అన్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​తో అనుసంధానమైన హ్యాచ్ సురక్షితంగా మూసివేసిన తర్వాత స్పేస్​ ఎక్స్ డ్రాగన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్పేస్ స్టేషన్ నుంచి భౌతికంగా దూరం కావడానికి రెండు సెపరేషన్ బర్న్​లు చేసిన తర్వాత డ్రాగన్ అంతరిక్ష నౌక ISS నుండి అన్​డాక్​ చేయబడింది. దీని తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి మరింత దూరంగా వెళ్లడానికి ‘డిపార్ట్ బర్న్ జీరో’ అని పిలువబడే నాలుగు ప్రణాళిక చేయబడిన డిపార్చర్ బర్న్​లలో మొదటిదాన్ని అమలు చేసింది.

ఐదు నిమిషాల తర్వాత స్పేస్ స్టేషన్ చుట్టూ ఉన్న 200 మీటర్ల జోన్ అయిన కీప్-అవుట్ గోళాన్ని క్లియర్ చేయడానికి ఇది రెండవ డిపార్చర్ బర్న్​ను నిర్వహించింది. ఇది అంతరిక్ష నౌకను సురక్షితమైన దూరంలో వచ్చి బయలుదేరుతూనే ఉండేలా రూపొందించబడింది. అంతరిక్ష నౌక 13 నిమిషాల విమాన ప్రయాణం తర్వాత అప్రోచ్ ఎలిప్సోయిడ్ – స్టేషన్ చుట్టూ ఉన్న రక్షిత 3D సరిహద్దు – నుంచి విజయవంతంగా నిష్క్రమించింది.

Subhanshu Shukla | విలువైన డేటాతో పుడమికి..

స్పేస్ ఎక్స్ డ్రాగన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో దిగనుంది. ఈ అంతరిక్ష నౌక 580 పౌండ్లకు పైగా సరుకును తిరిగి తీసుకుని వస్తుందని నాసా (NASA) ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హార్డ్వేర్​తో పాటు మిషన్ సమయంలో నిర్వహించిన 60 కంటే ఎక్కువ ప్రయోగాల నుంచి సేకరించిన విలువైన డేటా ఉన్నాయి. సముద్రంలో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ ను ప్రత్యేక నౌక మీదకు చేర్చి, వ్యోమగాములను బయటకు తీసుకొస్తారు. అనంతరం శుభాన్షు శుక్లా సహా నలుగురి ఆస్ట్రోనాట్స్ ను వారం రోజుల పాటు క్వారంటైన్ కు తరలిస్తారు. అంతరిక్షంలో భార రహిత స్థితిలో గడిపిన వ్యోమగాములు.. భూగురుత్వాకరణకు అలవాటు పడే వరకు వారిని క్వారంటైన్ చేస్తారు.

Subhanshu Shukla | మైక్రోఅల్గే ప్రయోగాలు

18 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న శుభాన్షు శుక్లా (Subhanshu Shukla).. శుక్లా మైక్రోఅల్గే అని పిలువబడే చిన్న మొక్కలపై పరిశోధనలు చేశాడు. ఆయా నమూనాలను సేకరించి నిల్వ చేయడంలో పనిచేశాడు. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లే వారికి అవసరమైన ఆహారం, ఆక్సిజన్, ఇంధనాన్ని అందించగల ప్రాజెక్టుపై అతను పరిశోధనలు చేశాడు. భూ గ్రహం వెలుపలి వాతావరణంలో మానవులు జీవించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.