అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sub-Registrar | ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి (Adilabad Sub-Registrar Srinivas Reddy) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ గిఫ్ట్ డీడ్ కోసం రూ.5వేలు లంచం డిమాండ్ చేసి అనిశాకు పట్టుబడ్డాడు. కాగా.. శ్రీనివాస్ రెడ్డి గతంలోనూ ఏసీబీకి దొరికాడు. బోధన్‌లో (Bodhan) పనిచేస్తున్న సమయంలో ఓ దస్తావేజు కోసం డబ్బులు తీసుకోగా ఏసీబీ అరెస్టు చేసింది. ఇప్పటికీ.. ఈ కేసు దర్యాప్తు దశలో ఉండగానే మళ్లీ అవినీతి నిరోధక శాఖకు (Anti-Corruption Department) చిక్కడం గమనార్హం.
సీనియర్ అసిస్టెంట్ హోదాలో శ్రీనివాస్ రెడ్డి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్ కార్యాలయాల్లో (Bodhan offices) సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఈ సమయంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. నాలా లేని భూములు, నాన్ లేఅవుట్ ప్లాట్ల (non-layout plots) స్థలాలకు సంబంధించి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేసిపెట్టాడు. అలాగే.. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సైతం రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. కానీ, అప్పట్లో పనిచేసిన ఒకరిద్దరు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇవ్వడంతో ఎలాంటి చర్యలు లేకుండానే వదిలేశారు.
Sub-Registrar | ఎట్టకేలకు చిక్కి..
శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ పనిచేసినా.. ఒకరిద్దరు డాక్యుమెంట్ రైటర్లను (document writers) తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. వారి ద్వారానే రోజువారీ వసూళ్లు జరుగుతాయి. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) పనిచేసిన సమయంలో పెద్దఎత్తున అక్రమాస్తూలు కూడగట్టాడు. ఏసీబీకి చిక్కినా తీరు మార్చుకోకపోగా.. తిరిగి వసూళ్లు ఎక్కువయ్యాయనే చర్చ జరిగింది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. అక్కడ కూడా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తీరా ఎట్టకేలకు ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యాడు.