Minister Ponguleti
Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar’s offices) సకల వసతులు, కల్పించి ఆధునిక హంగులతో నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్పొరేట్​ స్థాయిలో సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులను తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజలకు పారదర్శకంగా ఒకే చోట రిజిస్ట్రేషన్ సేవలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సచివాలయంలో శనివారం ఆయన రెవెన్యూ కార్యద‌ర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Minister Ponguleti | సొంత భవనాలు నిర్మిస్తాం

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్రజ‌ల‌కు, ప‌రిపాల‌న‌కు ఇబ్బంది లేకుండా సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలను తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. అందులో 37 మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతుండగా.. మిగిలినవన్నీ అద్దె భవనాల్లో ఉన్నట్లు వెల్లడించారు. నూతన భవనాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. మొద‌టి విడ‌త‌లో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో నాలుగు లేదా ఐదు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌తో పాటు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ కార్యాల‌యాన్ని నిర్మిస్తామని తెలిపారు.

హైదరాబాద్​ జిల్లాలో రెండు, రంగారెడ్డిలో మూడు చోట్ల, మేడ్చల్​లో మూడు, సంగారెడ్డి , ప‌ఠాన్‌చెరువు క‌ల‌పి ఒక‌టి ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలు నిర్మిస్తామన్నారు. ఆయా జిల్లాల్లోని అన్ని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలను ఇంటిగ్రేటేడ్​ భవనంలోకి మారుస్తామన్నారు. గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రన‌గ‌ర్, బాలాన‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (TALim) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఈ భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు.