Homeతాజావార్తలుACB Rides | అక్రమాలకు అడ్డాగా సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులు.. ఏసీబీ తనిఖీలతో అధికారుల్లో కలవరం

ACB Rides | అక్రమాలకు అడ్డాగా సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులు.. ఏసీబీ తనిఖీలతో అధికారుల్లో కలవరం

పలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Rides | రాష్ట్రంలోని పలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు (sub-registrar offices) అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. కొందరు సబ్​ రిజిస్ట్రార్లు నిబంధనలు పాటించడం లేదు. అక్రమార్కులు అండగా నిలుస్తున్నారు. మాముళ్లు తీసుకొని నిబంధనల మేరకు లేని డాక్యుమెంట్లకు సైతం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో గతంలో ఏసీబీ అధికారులు (ACB officials) పలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు SRO కార్యాలయాలలో (SRO offices) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 23 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

ACB Rides | నగదు స్వాధీనం

గండిపేట, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్ (Nizamabad Town), జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెదపల్లి, భూపాలపల్లి, వైరాలోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా ఆఫీసుల్లో లెక్కల్లో చూపని రూ. 2,51,990 నగదు స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు 289 రిజిస్టర్డ్ పత్రాలు కూడా గుర్తించారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేయలేదు. దాదాపు 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే 13 మంది సబ్​ రిజిస్ట్రార్ ఇళ్లలో కూడా ACB దాడి చేసి నగదు, నగలు, ఆస్తి పత్రాలను (jewellery and property documents) స్వాధీనం చేసుకుంది. ఏసీబీ దాడులతో సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Must Read
Related News