అక్షరటుడే, ఇందూరు: Judo selections | జిల్లా జూడో అసోసియేషన్ (Nizamabad Judo Association) ఆధ్వర్యంలో సబ్ జూనియర్, క్యాడెట్ విభాగంలో ఈ నెల 31న జిల్లా స్థాయి బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సెక్రెటరీ అభినవ్ తెలిపారు.
ఎంపికలు జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోని (Subhash nagar) డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్‌లో (DSA Swimming Pool) ఉదయం 10 గంటలకు ఉంటాయన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు. సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనేవారు 2011 నుంచి 2013 వరకు జన్మించినవారు అర్హులన్నారు. క్యాడెట్ విభాగంలో 2008, 2009, 2010లో జన్మించినవారు అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 5, 6 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.