అక్షరటుడే, ఇందూరు: Sub-Inspectors Transfer | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు.
అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో భాగంగా వెయిటింగ్లో ఉన్న ఎస్సైలను జిల్లాలోని వేరే ఠాణాలకు అటాచ్ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
Sub-Inspectors Transfer |
ప్రస్తుతం సీసీఎస్ (CCS) లో పని చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ Sub-Inspector జీ మహేష్‌ను జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది వరకు ఇక్కడ విధులు నిర్వర్తించే ఎస్సై.. గ్రూప్స్ పరీక్షల సన్నద్ధత కోసం దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లారు.
ఈ నేపథ్యంలో.. ఆయన స్థానంలోకి మహేష్‌ను తాత్కాలికంగా బదిలీ చేశారు. ఈమేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు వెలువర్చారు.
ఇక, నిజామాబాద్ సౌత్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో అటాచ్‌పై కొనసాగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ సామ శ్రీనివాస్‌ను ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, సదరు పోలీసు అధికారులు వారు పనిచేస్తున్న స్థానాల నుంచి రిలీవ్ అయి.. బదిలీ అయిన చోటులో రిపోర్టు చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
