Homeజిల్లాలుకామారెడ్డిSub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ బాధితుడు సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దకొడప్‌గల్‌కు (Peddagodapgal) చెందిన రమేశ్‌ ఇంటి సమీపంలో దోసపల్లి తులసీదాస్‌ అనే వ్యక్తి ఆయన ఇంట్లోనే వడ్రంగి మిషన్‌తో పనులు చేస్తున్నాడు.

ఈ క్రమంలో పెద్ద శబ్దాలు, దుమ్ముధూళితో ఇబ్బంది పడుతున్నామని గతంలో తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయ సందర్శనకు వచ్చిన సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి దృష్టికి తెచ్చాడు. దీంతో ఆమె స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు బాధితుడు రమేశ్‌ పేర్కొన్నాడు.

Must Read
Related News