7
అక్షరటుడే, బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. బోధన్ మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను (nomination centers) బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) గురువారం పరిశీలించారు.
పెంటాకుర్దు, సాలంపాడ్ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. డాక్యుమెంట్లను సరిగ్గా పరిశీలించాలని, రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.