ePaper
More
    Homeక్రైంHaryana | రోడ్డుపై కార్లతో స్టంట్లు.. షాకిచ్చిన పోలీసులు

    Haryana | రోడ్డుపై కార్లతో స్టంట్లు.. షాకిచ్చిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Haryana | కొంతమంది యువకులు రోడ్లపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తుంటారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్​ చేస్తూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడతారు. బైక్​లు, కార్లతో స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా రోడ్డుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తు రెండు కార్లతో రెచ్చిపోయిన నలుగురు యువకులకు హర్యానా(Haryana)లోని గురుగ్రామ్​ పోలీసులు (Gurugram Police) షాక్​ ఇచ్చారు.

    హర్యానాలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Dwarka Expressway)పై నలుగురు యువకులు రెండు కార్లలో ప్రమాదకరంగా ప్రయాణించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో గురుగ్రామ్​ పోలీసులు స్పందించారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు నలుగురు యువకులను అరెస్ట్​ చేశారు. మెర్సిడెస్​ బెంజ్​, స్కార్పియో కార్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను గురుగ్రామ్​ పోలీసులు ఎక్స్​లో పోస్ట్​ చేయగా వైరల్ అవుతోంది. రోడ్లపై రెచ్చిపోయే పోకిరీలకు ఇలాంటి శిక్షే కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...