అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dumas Beach | కొందరు యువకులు బెంజ్ కారు (Benz Car)తో బీచ్‌లో నిర్లక్ష్యంగా స్టంట్లు చేశారు. తర్వాత ఆ కారు సముద్రం ఒడ్డున చిక్కుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన గుజరాత్ (Gujarat)లో చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని సూరత్‌లోని డ్యూమాస్ బీచ్ (Dumas Beach)కు కొందరు యువకులు బెంజ్ కారులో వెళ్లారు. బీచ్ దగ్గర వరకు కార్లకు అనుమతి లేదు. అయినా వారు అధికారుల కళ్లు గప్పి కారు తీసుకొని వెళ్లారు. అనంతరం అక్కడ కారుతో స్టంట్లు చేయగా.. అది ఇసుకలో చిక్కుకుపోయింది. దానిని బయటకు తీయడానికి వాళ్లు అనేక తిప్పలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీచ్‌లోకి వాహనాల వెళ్లకుండా నిషేధించారు. అయినా కారు వెళ్లడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో కారు వెళ్లిన వీడియో వైరల్ అవుతోందన్నారు. దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు.. ఆ కారు ఎవరిది అనే వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.