అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sarpanch election | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ (Kalyani village) సర్పంచ్‌గా చూడ నవ్య అతి చిన్న వయసులో సర్పంచ్ పోటీ చేసి విజయం సాధించారు. ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతుండగానే సర్పంచ్ ఎన్నికలు (Sarpanch elections) రావడంతో తన తండ్రి సంజీవులు నవ్యను ఎన్నికల్లో నిలిపారు.
Sarpanch election | రాజకీయాలపై మక్కువతో..
రాజకీయాలపై మక్కువ.. తండ్రి మాటపై గౌరవంతో ఎన్నికల్లో నిలిచి ప్రత్యర్థులు చిన్నబాలి రత్నమాలపై చూడ నవ్య 584 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందింది. చూడ నవ్యకు 901ఓట్లు పోలవ్వగా, రత్నమాలకు 317ఓట్లు పోల్లయాయి. చూడ నవ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయగా తన సమీప ప్రత్యర్థి చినబాలి రత్నమాలపై ఓట్ల 584 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Sarpanch election | ఎమ్మెల్యే అభినందనలు..
ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy mandal) అత్యధిక మెజారిటీతో నవ్య గెలుపొందడంపై ఎమ్మెల్యే మదన్మోహన్, కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. చూడ నవ్య గెలుపుతో గ్రామంలో యువకులు హర్షం వ్యక్తం చేశారు.
Sarpanch election | నవ్య విద్యాభ్యాసం సాగిందిలా..
నవ్య మూడో తరగతి వరకు స్వగ్రామం కల్యాణిలో చదువుకుంది. నాల్గో తరగతి నుంచి పదో తరగతి వరకు బోర్లాం రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని కొనసాగించింది. అగ్రికల్చర్ డిప్లొమా చేసిన అనంతరం కామారెడ్డి ఆర్ట్స్ కళాశాలలో (Kamareddy Arts College) బీకాం పూర్తి చేశారు. ప్రస్తుతం ఘట్కేసర్లోని హిలీకేరి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఉన్నత చదువు చదువుతున్న నవ్య రాజకీయాల్లో తనకు ఆదరణ చూపిన గ్రామస్థులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ విద్య వైద్య ఉపాధి రంగాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.