అక్షరటుడే, కోటగిరి: Mla pocharam | బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency)అనేక కళాశాలలు ఏర్పాటు చేశామని.. విద్యార్థులు కష్టపడి చదవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. కోటగిరి(Kotagiri) మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను (Government Junior College) బుధవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బాన్సువాడలో డిగ్రీ ఉర్దూ మీడియం, నర్సింగ్, ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలను (Polytechnic College) ఏర్పాటు చేయించామన్నారు.
Mla pocharam | కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాలి
అనంతరం జూనియర్ కళాశాలలో విద్యార్థులు అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. గతేడాది వచ్చిన ఫలితాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యను, ఫలితాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ హన్మంత్, తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కైసర్ పాషా, విండో ఛైర్మన్ కూచి సిద్ధు, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, పత్తి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.