అక్షరటుడే, ఇందూరు: Vignan School | నగరంలోని విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు బుధవారం మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) డిప్యూటీ కమిషనర్ రవిబాబు విద్యార్థులకు మురికినీటి శుద్ధి గురించి.. ప్లాస్టిక్ (Plastic) వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనాల్లో వేయాలని సూచించారు. వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిలువ నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రశాంత్, జవాన్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాంట్ను సందర్శిస్తున్న విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు