153
అక్షరటుడే, లింగంపేట: Naganna well | మండల కేంద్రంలోని నాగన్న దిగుడు బావిని శనివారం పాల్వంచ ఉన్నత పాఠశాల (Palvancha High School) విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా బావి కట్టడాలను చూసి విద్యార్థులు ముగ్ధులయ్యారు.
Naganna well | పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
లింగంపేట మండల కేంద్రంలోని (Lingampet mandal) నాగన్న దిగుడు బావిని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. బావిని చూసేందుకు వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తే గొప్ప పర్యాటక ప్రాంతంగా నాగన్న బావి అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు.