అక్షరటుడే, ఇందూరు: Balbhavan | విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో బుధవారం కళాఉత్సవం (Kala Utsavam) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలలో విద్యతోపాటు సాంస్కృతిక, క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం గ్రూప్ డాన్స్, సోలో డాన్స్, గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్, ఇన్స్ట్రుమెంటల్, స్కిట్, 3డీ డ్రాయింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు.
పోటీలు బుధ, గురు వారం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ బాలకృష్ణారావు, నిజామాబాద్ ఎంఈఓ (Nizamabad MEO) సాయి రెడ్డి, జ్యూరీ కమిటీ మెంబర్స్ లక్ష్మీనాథం, గోపాలకృష్ణ, నరేష్ రావు, లక్ష్మణ్, శ్రీనివాస్, డాక్టర్ శారద పాల్గొన్నారు. న్యాయ నిర్ణీతలుగా ఉమాబాల, స్వప్నరాణి, జయలక్ష్మి, పాయల్, గంట్యాల ప్రసాద్ వ్యవహరించారు.
Balbhavan | సౌకర్యాలు కరువు..
బాల్భవన్లో కొనసాగుతున్న కళాఉత్సవం కార్యక్రమానికి సౌకర్యాల లేమి స్పష్టంగా కనబడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ (Education Department) ఆధ్వర్యంలో పలు అంశాల్లో పోటీలో నిర్వహించారు. కానీ విద్యార్థులు తయారయ్యేందుకు ప్రత్యేక గదిలేకపోవడంతో వెనుకవైపు పిచ్చిమొక్కల మధ్య ముస్తాబయ్యారు. అలాగే కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. అపరిశుభ్రమైన మూత్రశాలలతో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు.