Fee reimbursement
Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

అక్షరటుడే, కామారెడ్డి : Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు.

ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా(Nizamsagar Chowrastha) వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో ఒకవైపు రహదారిని దిగ్బంధించి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్ షిప్ (Scholarship) బకాయిలు రూ.8,300 కోట్ల ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్యం వహించడంతో బకాయిలు పెరిగిపోయాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని, నిధులు విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటికీ దానిపై మాట్లాడడం లేదన్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బకాయిలు నిలిచిపోవడంతో విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయన్నారు. ఫలితంగా ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు పైస్థాయికి వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇకనైనా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులందరితో కలిసి అసెంబ్లీని (Telangana Assembly) ముట్టడిస్తామని హెచ్చరించారు.