ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని.. రోడ్డెక్కిన విద్యార్థినులు

    Yellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని.. రోడ్డెక్కిన విద్యార్థినులు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని నిరసిస్తూ విద్యార్థినులు(Students) ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు సోమవారం ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు.

    Yellareddy | తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాం..

    విధిలేని పరిస్థితుల్లో తాము రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నామని విద్యార్థినులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల నిరసనతో ఎల్లారెడ్డి – బాన్సువాడ(Yellareddy Banswada) ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్(Yellareddy Tahsildar Prem Kumar) రోడ్డుపై భైఠాయించిన విద్యార్థినులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

    Yellareddy | పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్​..

    అనంతరం గిరిజన బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్(Additional Collector Victor) పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న ఆయన పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలలోని డైనింగ్ హాల్, స్టాక్ రూమ్, వాష్ రూమ్​లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న ఆయన త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్​ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎంఈవో రాజులు తదితరులు పాల్గొన్నారు.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...