HomeతెలంగాణSub-Collector Kiranmayi | విద్యార్థులు కష్టపడి చదవాలి

Sub-Collector Kiranmayi | విద్యార్థులు కష్టపడి చదవాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్ : Sub-Collector Kiranmayi | విద్యార్థులు కష్టపడి చదువులో రాణించాలని.. అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi) అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా హెచ్​ఎం మధుసూదన్ రాజ్​తో ​మాట్లాడి పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. ఏఏ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చదువుకునేందుకు వస్తారనే వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ప్రత్యేక తరగతులు ఏమైనా కొనసాగిస్తున్నారా.. పాఠశాలలో (Mohammed Nagar School) ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను ప్రశ్నించారు.

ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్థం అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చదువుల్లో రాణించాలని, అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని విద్యార్థులకు సూచించారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె వెంట తహశీల్దార్ సవాయిసింగ్, డిప్యూటీ తహశీల్దార్​ క్రాంతికుమార్, ఆర్ఐ పండరి తదితరులున్నారు.