ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi kantha Rao | విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

    Mla Laxmi kantha Rao | విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi kantha Rao | విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బిచ్కుంద (Bichkunda) మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల (Minority residential school), జూనియర్ కళాశాలను మంగళవారం సందర్శించారు.

    ముందుగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి, టాయిలెట్స్, తాగునీరు వసతి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, డైట్ మెనూను పరిశీలించారు.

    Mla Laxmi kantha Rao | విద్యార్థులతో కలిసి భోజనం..

    విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, చిన్నపాటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

    Mla Laxmi kantha Rao | చదువు జీవితాలను మారుస్తుంది..

    చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుందని, సమాజంలో మనకు గుర్తింపు, గౌరవం ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకశ్రద్ధ వహించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడి చదివి రాణించాలని విద్యార్థులకు సూచించారు.

    మొక్కనాటి నీళ్లు పోస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు

    Latest articles

    Vice President | ఉప రాష్ట్రపతి రేసులో శేషాద్రి రామానుజాచారి.. ఇంతకీ ఎవరాయన?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారత ఉపరాష్ట్ర పదవికి జగదీప్​ ధన్​ఖడ్ (Jagdeep Dhankhad)​ రాజీనామా...

    Heavy Rain Alert | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో బుధవారం...

    IND vs ENG | చరిత్ర సృష్టించిన భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది తొలిసారి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : భారత్, ఇంగ్లండ్ England TeaM జట్ల మధ్య జరిగిన ఐదు...

    Today Gold Price | బంగారం లాంటి వార్త.. త‌గ్గిన పసిడి ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలో బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో...

    More like this