అక్షరటుడే, కోటగిరి: Kotagiri | విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు. మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో (Minority Residential School) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మత్తు పదార్థాలు (Drugs), సైబర్ క్రైంపై (Cyber crime) అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాలిక్, అంగన్వాడీ సూపర్వైజర్ కొమురవ్వ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు, పాల్గొన్నారు.
